వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

వినోదం | రచన: Kalyan |

AK 47: వెంకీ-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ పబ్లిక్ టాక్.. సినిమాకి హైలెట్ అదేనట.. ఎలా ఉందంటే..?

AK 47
AK 47 Photo: AK 47

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ అక్టోబర్ 30న విడుదలైంది. ఫస్ట్ హాఫ్‌లో వెంకటేష్ కామెడీ, సత్య ట్రాక్, ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు.

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. అయితే అప్పట్లో త్రివిక్రమ్ రచయితగా పనిచేయగా.. ఇప్పుడు తొలిసారి వెంకటేష్‌ను దర్శకుడిగా నడిపించారు. దీంతో వీరి కలయికలో వస్తున్న ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఎట్టకేలకు అక్టోబర్ 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే తొలి షోల తర్వాత సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. మొత్తం 149 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వెంకటేష్ తనదైన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారని చెబుతున్నారు. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టితో ఆయన కెమిస్ట్రీ కూడా తెరపై బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. కమెడియన్ సత్య కామెడీ, విలన్ ఎంట్రీ, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయని అభిమానులు పేర్కొంటున్నారు. అయితే సెకండాఫ్ విషయంలో మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. కథనం నెమ్మదించడం, కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపించడం సినిమాకు మైనస్‌గా మారాయని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి. త్రివిక్రమ్ శైలి సంభాషణలు, ఎమోషన్స్ అక్కడక్కడా ఆకట్టుకున్నప్పటికీ.. కొన్ని చోట్ల కామెడీని బలవంతంగా ఇరికించిన భావన కలుగుతోందని అంటున్నారు. మరోవైపు థమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం కూడా సినిమాపై ఉన్న అంచనాలను అందుకోలేకపోయాయని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఆదర్శ కుటుంబం సినిమాకు ప్రస్తుతం డివైడ్ టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ నటన, కామెడీ కోసం ఒకసారి థియేటర్లలో చూడొచ్చని కొందరు చెబుతుంటే.. భారీ అంచనాలతో వెళ్లేవారికి సెకండాఫ్ కొంత నిరాశ కలిగించవచ్చని మరికొందరి అభిప్రాయం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం లాంగ్ వీకెండ్‌లో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మిశ్రమ స్పందన బాక్సాఫీస్ వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.