వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

నేర వార్తలు | రచన: Kalyan |

Suicide: నా చావుకు వాళ్లే కారణం.. సూసైడ్ నోట్ రాసి యువకుడి బలవన్మరణం.. అసలేం జరిగిందంటే..?

Suicide
నా చావుకు వాళ్లే కారణం.. సూసైడ్ నోట్ రాసి యువకుడి బలవన్మరణం.. అసలేం జరిగిందంటే..? Photo: నా చావుకు వాళ్లే కారణం.. సూసైడ్ నోట్ రాసి యువకుడి బలవన్మరణం.. అసలేం జరిగిందంటే..?

ఆసుపత్రికి వెళ్లిన యువకుడికి అక్కడ ఎదురైన అనుభవం చివరకు తీవ్ర విషాదానికి దారితీసింది. చికిత్స కోసం వెళ్లిన చోట వైద్య సిబ్బందితో వాగ్వాదం.. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు తరలింపు.. అక్కడ అవమానించారని ఆరోపణలు.. చివరకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడు తీసుకున్న తీవ్ర నిర్ణయం.. ఆదిలాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఆసుపత్రికి వెళ్లిన యువకుడికి అక్కడ ఎదురైన అనుభవం చివరకు తీవ్ర విషాదానికి దారితీసింది. చికిత్స కోసం వెళ్లిన చోట వైద్య సిబ్బందితో వాగ్వాదం.. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు తరలింపు.. అక్కడ అవమానించారని ఆరోపణలు.. చివరకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడు తీసుకున్న తీవ్ర నిర్ణయం.. ఆదిలాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తన మృతికి రిమ్స్ వైద్యులు, పోలీసులే కారణమంటూ లేఖ రాసి 25 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ పట్టణంలోని వికలాంగుల కాలనీకి చెందిన రాహుల్ (25) పుణెలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దసరా పండుగ సెలవుల కోసం ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి అతడి చేయి బెణకడంతో తీవ్ర నొప్పి వచ్చింది. దీంతో చికిత్స కోసం ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది సకాలంలో స్పందించలేదని, దీంతో వారి తీరును రాహుల్ తన ఫోన్‌లో వీడియో తీయడం ప్రారంభించాడని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు చెబుతున్నారు. ఈ సమయంలో క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌరభ్, స్టాఫ్ నర్స్ మమతతో రాహుల్‌కు వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆసుపత్రిలో న్యూసెన్స్ చేస్తున్నాడంటూ వైద్య సిబ్బంది డయల్-100కు ఫిర్యాదు చేశారు. దీంతో టూటౌన్ పోలీస్ స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ ఫతేసింగ్ అక్కడికి చేరుకుని రాహుల్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ తనను కొట్టడంతో పాటు అసభ్యంగా దూషించారని రాహుల్ ఆరోపించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనంతరం ఇంటికి చేరుకున్న అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాహుల్ సూసైడ్ నోట్ రాసి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మరణానికి రిమ్స్ వైద్యులు, పోలీసులే కారణమని ఆ లేఖలో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో రిమ్స్ డైరెక్టర్ ఛాంబర్ ఎదుట నిరసనకు దిగారు. రాహుల్ మరణానికి బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యులు, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించారు. అదనపు ఎస్పీ బి. సురేందర్‌రావును ప్రత్యేక విచారణ అధికారిగా నియమించారు. మృతుడి తండ్రి కె. రాజు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు డాక్టర్ సౌరభ్, స్టాఫ్ నర్స్ మమత, టూటౌన్ హెడ్‌కానిస్టేబుల్ ఫతేసింగ్, బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ జీవన్, హోంగార్డు నవీన్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.