వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

ఆంధ్రప్రదేశ్ | రచన: Pallavi |

ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తం!

ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD సూచించింది.

ఏపీలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో నవంబర్ 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేస్తోంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఆదివారం, సోమవారం, మంగళవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. రాయలసీమ ప్రాంతంలోనూ రానున్న మూడు రోజుల పాటు వాతావరణం మారనుంది. ఆదివారం నుంచి మంగళవారం వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, మెరుపులు సంభవించే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదు. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను గమనించి వ్యవసాయ పనులు చేపట్టడం మంచిది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు ఈదురుగాలులు, పిడుగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.