వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

వినోదం | రచన: Kalyan |

Tollywood Buzz: హైదరాబాద్‌లో ఇంటిని అమ్మేసిన అనుష్క.. టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పబోతుందా..?

Tollywood Buzz

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన అనుష్క శెట్టి గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఇంటిని భారీ మొత్తానికి అమ్మేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంగళూరులోనే స్థిరపడాలని భావిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన అనుష్క శెట్టి ఇప్పుడు సినిమాలకు చాలా దూరంగా ఉంటున్నారు. ‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘భాగమతి’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్వీటీ.. గత కొన్నేళ్లుగా అప్పుడప్పుడు మాత్రమే తెరపై కనిపిస్తున్నారు. సినిమాలు చేసినా ప్రమోషన్లకు రావడం లేదు.. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. దీంతో అభిమానులు ఆమెను ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో అనుష్క గురించి మరో వార్త టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 2018లో ‘భాగమతి’ తర్వాత అనుష్క సినిమాల వేగం పూర్తిగా తగ్గిపోయింది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఆమె చేసిన సినిమాలు కూడా చాలా తక్కువ. అప్పుడప్పుడు మాత్రమే కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గతంలో స్టార్ హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమాలకు దూరమవుతూ, హైదరాబాద్‌లో ఉండటం తగ్గించుకున్న తర్వాత ఆ ఇంటిని అద్దెకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా ఆ ఇంటిని భారీ మొత్తానికి అమ్మేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనుష్క హైదరాబాద్‌లోని ఇంటిని అమ్మేయడంతో ఆమె ఇక టాలీవుడ్‌కు పూర్తిగా దూరం కానున్నారా? అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆమె తన స్వస్థలమైన మంగళూరులోనే ఎక్కువ సమయం గడుపుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఉండాల్సిన అవసరం తగ్గడంతోనే ఇంటిని విక్రయించిందని, ఇక సినిమాలకు కూడా గుడ్‌బై చెప్పబోతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే టాలీవుడ్‌కు స్వీటీ పూర్తిగా దూరమవుతున్నారనే వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో ఈ ప్రచారంలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఓ సినిమా చేసినట్లు సమాచారం. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. తెలుగులో యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఓ సినిమా ఉంటుందనే వార్తలు గతంలో వినిపించినప్పటికీ, దానిపై అధికారిక ప్రకటన రాలేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో అభిమానులను అలరించిన అనుష్క ఇప్పుడు ఇలా దూరంగా ఉండటంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. హైదరాబాద్‌లో ఇంటిని అమ్మేసిందనే వార్తలతో ఇక స్వీటీ సినిమాలు చేయడం మానేస్తుందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అనుష్క మళ్లీ తెలుగు తెరపై ఎప్పుడు కనిపిస్తారో, అభిమానులకు ఎప్పుడు గుడ్‌న్యూస్ చెబుతారో చూడాలి.