వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

ఆంధ్రప్రదేశ్ | రచన: Kalyan |

AP Elections: ఏపీలో ఎన్నికల వేళ భారీగా నగదు పట్టివేత.. వైసీపీ నేతల వద్ద రూ.79 లక్షలకు పైగా సీజ్!

AP Elections
AP Elections Photo: AP Elections

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల వేళ నగదు పంపిణీ వ్యవహారాలు కలకలం రేపుతున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల వేళ నగదు పంపిణీ వ్యవహారాలు కలకలం రేపుతున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో కర్నూలు నగరంలో ఏకంగా రూ.76 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ తరఫున 27వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహేశ్వరరెడ్డి స్నేహితుడు, డాక్టర్ అమర్‌నాథ్ రెడ్డి ఇంట్లో రాత్రి ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది ఈ నగదును గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోనూ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. నాలుగో వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి పురందర్ తన స్నేహితుడు బోయ వన్నూరుతో కలిసి ఓటర్లకు నగదు పంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని రూ.45,510 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పురందర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక నందికొట్కూరు పట్టణంలోనూ నగదు పంపిణీ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు ఇద్దరు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ముచ్చుమర్రి గ్రామానికి చెందిన రత్నస్వామి వద్ద రూ.1.43 లక్షలు స్వాధీనం చేసుకోగా, బైరెడ్డి నగర్‌లోని కోట హైస్కూల్ వద్ద మంజునాథ్ నుంచి మరో రూ.1,01,000 నగదును సీజ్ చేశారు. ఇలా కర్నూలు, నంద్యాల, నందికొట్కూరు ప్రాంతాల్లో వరుసగా నగదు పట్టుబడటం రాజకీయంగా చర్చకు దారితీసింది.