వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

ఆంధ్రప్రదేశ్ | రచన: Kalyan |

AP Inter Exams 2027: ఇంటర్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఫిబ్రవరి 24 నుంచే ఎగ్జామ్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

AP Inter Exams 2027
ఇంటర్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఫిబ్రవరి 24 నుంచే ఎగ్జామ్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే! Photo: ఇంటర్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఫిబ్రవరి 24 నుంచే ఎగ్జామ్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2027 ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 15న, రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 16న ముగియనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్. 2027 ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన టైమ్‌టేబుల్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ షెడ్యూల్ ప్రకారం మొదటి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24న ప్రారంభమై మార్చి 15న ముగియనున్నాయి. రెండో సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25న మొదలై మార్చి 16 వరకు కొనసాగనున్నాయి. దీంతో విద్యార్థులు పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 24న సెకండ్ లాంగ్వేజ్ పేపర్‌-1తో పరీక్షలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 26న ఇంగ్లీష్ పేపర్‌-1, మార్చి 1న మ్యాథ్స్‌-1A, సివిక్స్‌-1, బోటనీ-1 పరీక్షలు ఉంటాయి. మార్చి 3న మ్యాథ్స్‌-1B, జువాలజీ-1, హిస్టరీ-1, మార్చి 5న ఫిజిక్స్‌-1, ఎకనామిక్స్‌-1 పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 9న కెమిస్ట్రీ-1తో పాటు కామర్స్‌, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 12న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌-1, లాజిక్‌-1, బైపీసీ విద్యార్థుల బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్‌-1 పరీక్షలు ఉంటాయి. మార్చి 15న మోడరన్ లాంగ్వేజ్‌-1, జియోగ్రఫీ-1తో మొదటి సంవత్సరం పరీక్షలు ముగుస్తాయి. రెండో సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 25న సెకండ్ లాంగ్వేజ్ పేపర్‌-2, ఫిబ్రవరి 27న ఇంగ్లీష్ పేపర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 2న మ్యాథ్స్‌-2A, సివిక్స్‌-2, బోటనీ-2, మార్చి 4న మ్యాథ్స్‌-2B, జువాలజీ-2, హిస్టరీ-2 పరీక్షలు ఉంటాయి. మార్చి 8న ఫిజిక్స్‌-2, ఎకనామిక్స్‌-2, మార్చి 11న కెమిస్ట్రీ-2తో పాటు కామర్స్‌, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 13న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌-2, లాజిక్‌-2, బైపీసీ బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 16న మోడరన్ లాంగ్వేజ్‌-2, జియోగ్రఫీ-2 పరీక్షలతో రెండో సంవత్సరం పరీక్షలు పూర్తవుతాయి. సాధారణ థియరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. థియరీ పరీక్షలకు ముందే ప్రాక్టికల్స్‌, ఇతర తప్పనిసరి పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జనవరి 27న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 29న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నాయి. జనరల్ కోర్సుల ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వొకేషనల్ కోర్సుల ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహిస్తారు. ఇవి ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరగనున్నాయి. సమగ్ర శిక్ష వొకేషనల్ ట్రేడ్‌ NSQF లెవల్‌-4 థియరీ పరీక్ష ఫిబ్రవరి 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అయితే, ఇది తాత్కాలిక షెడ్యూల్ కావడంతో ప్రభుత్వ సెలవులు, ఇతర కారణాల దృష్ట్యా మార్పులు ఉండవచ్చు. విద్యార్థులు బోర్డు నుంచి వెలువడే తుది టైమ్‌టేబుల్‌ను కూడా తప్పనిసరిగా పరిశీలించాలి.