వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

ఆంధ్రప్రదేశ్ | రచన: Kalyan |

Bay Of Bengal: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన.. ఆ రెండు రోజులు కీలకం..!

Bay Of Bengal
బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన.. ఆ రెండు రోజులు కీలకం..! Photo: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన.. ఆ రెండు రోజులు కీలకం..!

బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం రానున్న రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ వాతావరణ వ్యవస్థ క్రమంగా బలపడే అవకాశం ఉండటంతో రానున్న రోజుల్లో దాని కదలికలపై వాతావరణ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని కోస్తా ప్రాంతాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవుల పరిసరాల్లో మరింత స్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత మరో 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసరాల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని తెలిపింది. అయితే దీని తదుపరి కదలికలు, తీవ్రతపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో నవంబర్ 1, 2 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో తీర ప్రాంత ప్రజలు వాతావరణ శాఖ సూచనలను గమనిస్తూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాయుగుండం ఏ దిశగా కదులుతుంది? దాని ప్రభావం ఏయే ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుంది.. అనే అంశాలపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.