Cyclone: తుఫాన్ సమయంలో మగబిడ్డ జననం.. కుటుంబ సభ్యులు పెట్టిన పేరు ఇదే..!
ఒడిశాలోని గంజాం జిల్లాలో ఆర్నబ్ తుఫాన్ ప్రభావం కొనసాగుతున్న సమయంలో ఓ గర్భిణి మగబిడ్డకు జన్మనిచ్చింది. తుఫాన్ సమయంలో పుట్టిన చిన్నారికి కుటుంబ సభ్యులు అర్నబ్ అని పేరు పెట్టారు.
ఒడిశాలోని గంజాం జిల్లాలో అర్నబ్ తుఫాన్ ప్రభావం కొనసాగుతున్న సమయంలో ఓ గర్భిణి మగబిడ్డకు జన్మనిచ్చింది. తుఫాన్ సమయంలో పుట్టిన చిన్నారికి కుటుంబ సభ్యులు అర్నబ్ అని పేరు పెట్టారు. ఆరోగ్య శాఖ అధికారులు జనన ధ్రువీకరణ పత్రాన్ని కూడా జారీ చేసినట్లు సమాచారం.
తుఫాన్ పేరు వింటేనే ప్రజలు భయాందోళనలకు గురవుతుంటారు. కానీ ఒడిశాలోని ఓ కుటుంబానికి మాత్రం అదే పేరు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మారింది. రాష్ట్రాన్ని వణికిస్తున్న అర్నబ్ తుఫాన్ సమయంలో ఓ గర్భిణి మగబిడ్డకు జన్మనివ్వగా.. ఆ పసికందుకు కుటుంబ సభ్యులు తుఫాన్ పేరునే పెట్టారు. దీంతో ఆ చిన్నారి పేరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఒడిశాలోని గంజాం జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తుఫాన్ ప్రభావం కొనసాగుతున్న సమయంలో జన్మించిన బిడ్డకు కుటుంబ సభ్యులు అర్నబ్ అని నామకరణం చేశారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ అధికారులు జనన ధ్రువీకరణ పత్రాన్ని కూడా జారీ చేసినట్లు సమాచారం. సాధారణంగా పిల్లలకు కుటుంబ పెద్దలు, దేవుళ్లు లేదా తమకు ఇష్టమైన వ్యక్తుల పేర్లు పెడుతుంటారు. కానీ ప్రకృతి విపత్తు సమయంలో పుట్టిన బిడ్డకు అదే తుఫాన్ పేరు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు అర్నబ్ తుఫాన్ ఒడిశాలోని పలు ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది. గత రెండు రోజులుగా బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రసవ సమయం దగ్గరపడిన గర్భిణులను ముందుగానే ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జన్మించిన చిన్నారికి తుఫాన్ పేరే పెట్టడం ఈ ఘటనకు ప్రత్యేకతను తీసుకొచ్చింది.