వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

ఆంధ్రప్రదేశ్ | రచన: Kalyan |

Arnab: ప్రజలకు బిగ్ అలర్ట్.. అర్నాబ్ తుఫాన్‌ ముప్పు.. పునరావాస కేంద్రాలకు తరలింపు..!

cyclone
cyclone Photo: cyclone

అర్నాబ్ తుఫాన్‌ ముప్పుతో కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.

అర్నాబ్ తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీరప్రాంతాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాబోయే 48 గంటల పాటు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ మైకుల ద్వారా అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఐఎండీ తాజా అంచనాల ప్రకారం తుఫాన్ బుధవారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం సహాయక చర్యలను వేగవంతం చేసింది. తుఫాన్ ముప్పు ఉన్న తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. స్థానికంగా అందిన సమాచారం ప్రకారం కాకినాడ అర్బన్‌లోని ఏటిమొగ ప్రాంతంలోని ఏఎస్డీ మహిళా కళాశాల, కాకినాడ రూరల్ మండలంలోని వాకలపూడి పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలిస్తున్నారు. జిల్లాలో మొత్తం 101 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. పునరావాస కేంద్రాలకు చేరుకున్న ప్రజలకు ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తుఫాన్ కారణంగా ప్రాణనష్టం జరగకుండా చూడటమే లక్ష్యంగా వివిధ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, తీర ప్రాంతాల్లో నివసించేవారు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం తుఫాన్ తీరం దాటే సమయంలో కాకినాడ పరిసరాల్లో సముద్రపు నీరు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది. తీరప్రాంతాల్లో సముద్రపు అలలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు బీచ్‌లు, సముద్రతీరాలకు వెళ్లకూడదు. విద్యుత్ తీగలు, నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.