వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

ఆంధ్రప్రదేశ్ | రచన: Kalyan |

తుపాను ఎఫెక్ట్‌తో ఏపీలో వర్ష బీభత్సం.. 6 జిల్లాలకు భారీ అలర్ట్.. ప్రజలకు హెచ్చరిక..!

cyclone

ఆంధ్రప్రదేశ్‌ను మురసు తుపాను వర్షాలు వణికిస్తున్నాయి. తుపాను తీరం దాటి వెళ్లినా దాని ప్రభావం మాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తుండగా.. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ను మురసు తుపాను వర్షాలు వణికిస్తున్నాయి. తుపాను తీరం దాటి వెళ్లినా దాని ప్రభావం మాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తుండగా.. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వర్ష బీభత్సం కనిపిస్తోంది. పొన్నూరులో ఏకంగా 31.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరులోనూ 30 సెంటీమీటర్ల వర్షం కురవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ అధికారుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లిలో 17.9 సెం.మీ., తెనాలిలో 17.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. బాపట్లలో 15.7 సెం.మీ., నరసరావుపేటలో 14.5 సెం.మీ., ఏలూరులో 14.1 సెం.మీ., చీరాలలో 13.5 సెం.మీ. వర్షం కురిసింది. తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీ వర్షాలు, ఈదురుగాలులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు వర్షాలు, గాలుల నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, కల్వర్టులను దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ తీగలు తెగిపడిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని కోరుతున్నారు. తుపాను బలహీనపడుతున్నప్పటికీ దాని ప్రభావంతో వర్షాలు కొనసాగవచ్చన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.