వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

జాతీయం | రచన: Kalyan |

Delhi: దసరా వేడుకల్లో కొత్త ట్రెండ్.. 30 అడుగుల కాక్‌రోచ్‌ను ఎందుకు దహనం చేస్తున్నారంటే..!

delhi ravan dahan
దసరా వేడుకల్లో కొత్త ట్రెండ్.. 30 అడుగుల కాక్‌రోచ్‌ను ఎందుకు దహనం చేస్తున్నారంటే..! Photo: దసరా వేడుకల్లో కొత్త ట్రెండ్.. 30 అడుగుల కాక్‌రోచ్‌ను ఎందుకు దహనం చేస్తున్నారంటే..!

ఢిల్లీలో ఈసారి రామ్‌లీలా వేడుకల్లో వినూత్న కార్యక్రమానికి నిర్వాహకులు సిద్ధమయ్యారు. రావణాసురుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు 30 అడుగుల బొద్దింక దిష్టిబొమ్మను కూడా దహనం చేయనున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి దసరా వేడుకల్లో ఓ ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకోనుంది. ఢిల్లీలో దసరా నాడు ఏటా రావణాసురుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి భారీ దిష్టిబొమ్మలను దహనం చేయడం ఆనవాయితీ. అయితే ఈసారి వీటికి అదనంగా ఏకంగా 30 అడుగుల ఎత్తున్న బొద్దింక దిష్టిబొమ్మను కూడా దహనం చేయనున్నారు. పితాంపురలో రామ్‌లీలా కార్యక్రమాన్ని నిర్వహించే శ్రీ కేశవ్ రామ్‌లీలా కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ వినూత్న కార్యక్రమం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కమిటీ నిర్వాహకుల ప్రకారం.. బొద్దింక అపరిశుభ్రతకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచడం, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఢిల్లీ కార్యక్రమాల సందేశాన్ని చాటిచెప్పడం ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని వెల్లడించారు. రావణాసురుడి దిష్టిబొమ్మతో పాటు బొద్దింకను కూడా దహనం చేయడం ద్వారా చెడుపై మంచి సాధించిన విజయాన్ని విభిన్నంగా చూపించనున్నారు. అంతేకాదు, రావణుడి సైన్యంలోని రాక్షసుల రూపాల్లోనూ బొద్దింకను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ నిర్ణయం తీసుకున్న సమయంలో ఢిల్లీలో మరో పరిణామం కూడా చర్చకు వస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్‌రొచ్ జనతా పార్టీ (CJP) దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో రామ్‌లీలా వేడుకల్లో బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేయాలనే నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రెండు అంశాల మధ్య సంబంధం ఉందనే చర్చ జరుగుతున్నప్పటికీ, రామ్‌లీలా కమిటీ అధ్యక్షుడు అశోక్ గోయల్ మాత్రం తమ నిర్ణయానికి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. పరిశుభ్రతపై ప్రజలకు సందేశం ఇవ్వడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.