వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

జాతీయం | రచన: Kalyan |

Delhi: జిమ్ ట్రైనర్‌తో ఎఫైర్.. కూతురు పక్కనే నిద్రిస్తుండగా భర్తను చంపే ప్లాన్.. చివరికి ఏమైందంటే..!

Delhi
జిమ్ ట్రైనర్‌తో ఎఫైర్.. కూతురు పక్కనే నిద్రిస్తుండగా భర్తను చంపే ప్లాన్.. చివరికి ఏమైందంటే..! Photo: జిమ్ ట్రైనర్‌తో ఎఫైర్.. కూతురు పక్కనే నిద్రిస్తుండగా భర్తను చంపే ప్లాన్.. చివరికి ఏమైందంటే..!

ఢిల్లీలో వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త శశాంక్ కంథారియాపై కత్తులతో దాడి చేసినట్లు జిమ్ ట్రైనర్ సింగ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో శశాంక్ తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

భర్తతో కలిసి ఉండటం ఇష్టం లేకపోతే విడిపోవాలని నిర్ణయించుకోవచ్చు. కానీ, మరో వ్యక్తితో ఉన్న సంబంధం బయటపడటంతో భర్తనే అంతం చేయాలని కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మహిళ ఉదంతం ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఢిల్లీలో వెలుగుచూసిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. కూతురి పక్కనే నిద్రిస్తున్న భర్తపై కత్తులతో దాడి చేయడం, చిన్నారి ఏడుపుతో నిందితుడు అక్కడి నుంచి పారిపోవడం ఈ ఘటనలో కలచివేసే అంశాలు. ఢిల్లీ ప్రభుత్వంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల శశాంక్ కంథారియాకు 2021లో ప్రియతో వివాహమైంది. ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది. వీరు ఢిల్లీలోని వసుంధర అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రియ స్థానిక జిమ్‌కు వెళ్లే క్రమంలో అక్కడ ట్రైనర్‌గా పనిచేస్తున్న సింగ్‌తో పరిచయం ఏర్పడింది. గత జనవరిలో మొదలైన పరిచయం కొద్దికాలానికే వివాహేతర సంబంధంగా మారినట్లు పోలీసులు తెలిపారు. అయితే సెప్టెంబర్‌లో ఈ విషయం భర్త శశాంక్‌కు తెలియడంతో భార్యను నిలదీశాడు. జిమ్ మార్చాలని లేదా అక్కడికి వెళ్లడం మానేయాలని చెప్పినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇల్లు మార్చాలనే నిర్ణయంపై కూడా దంపతుల మధ్య గొడవలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. భర్త కొత్త ఇల్లు వెతుకుతున్న విషయాన్ని ప్రియ తన ప్రియుడు సింగ్‌కు చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. దీంతో శశాంక్‌ను హత్య చేసేందుకు ఇద్దరూ కలిసి పథకం వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పథకం ప్రకారం ప్రియ జిమ్‌కు వెళ్లే ముందు ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచిందని, ఆమె బయటకు వెళ్లిన తర్వాత సింగ్ కత్తులతో ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. బెడ్‌రూమ్‌లో కుమార్తె పక్కన నిద్రిస్తున్న శశాంక్‌పై కత్తులతో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. తండ్రి అరుపులకు మేల్కొన్న చిన్నారి ఏడవడంతో సింగ్ అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. చిన్నారి ఏడుపు విని అప్రమత్తమైన స్థానికులు తీవ్రంగా గాయపడిన శశాంక్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మరోవైపు, చేతులకు రక్తంతో బయటకు వచ్చిన సింగ్‌ను అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిని నెట్టేసి పారిపోయేందుకు యత్నించాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది బైక్‌పై వెంబడించి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో వివాహేతర సంబంధం, హత్యాయత్నం కుట్ర కోణాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రియతో పాటు సింగ్‌ను కూడా అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా, వారిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు వెల్లడించారు.