దీపావళి షాపింగ్‌లో సరికొత్త ట్రెండ్.. ఇన్‌స్టామార్ట్‌లో వీటికి సూపర్ డిమాండ్!
దీపావళి సందర్భంగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆన్‌లైన్ షాపింగ్ భారీగా పెరిగింది. బంగారు నాణేల ఆర్డర్లు 23 రెట్లు, వెండి నాణేల ఆర్డర్లు 7 రెట్లు పెరిగాయి. మిఠాయిల కొనుగోళ్లు 55 శాతం వృద్ధి చెందగా, హెల్తీ స్నాక్స్‌కు కూడా భారీ డిమాండ్ కనిపించింది.
దీపావళి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ షాపింగ్ జోరందుకుంది. పండుగకు అవసరమైన వస్తువుల నుంచి బంగారు, వెండి నాణేలు, స్వీట్లు, ఇంటి అలంకరణ వస్తువుల వరకు ప్రజలు ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఈసారి ఊహించని స్థాయిలో ఆర్డర్లు పెరిగాయి. ధన్‌తేరస్‌కు ముందు వారంలో బంగారు నాణేల ఆర్డర్లు ఏకంగా 23 రెట్లు పెరిగినట్లు సంస్థ వెల్లడించింది.
ధన్‌తేరస్ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం శుభప్రదమని చాలామంది భావిస్తారు. ఈ సంప్రదాయం ఆన్‌లైన్ షాపింగ్‌లోనూ కనిపించింది. ఇన్‌స్టామార్ట్‌లో 1 గ్రాము బంగారు నాణేలకు అత్యధిక డిమాండ్ ఉండగా, ఆ తర్వాత 0.5 గ్రాము నాణేలను ఎక్కువగా కొనుగోలు చేశారు. బెంగళూరు బంగారు నాణేల కొనుగోళ్లలో మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్, ముంబై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వెండి నాణేల ఆర్డర్లు కూడా ఏడు రెట్లు పెరిగాయి.
దీపావళి అంటే స్వీట్లు, పిండి వంటలు తప్పనిసరి. ఈసారి ఇన్‌స్టామార్ట్‌లో మిఠాయిల ఆర్డర్లు 55 శాతానికి పైగా పెరిగాయి. లడ్డూ, సోన్‌పాపిడి, కాజు కట్లీ, గులాబ్ జామూన్, పెడా వంటి స్వీట్లకు ఎక్కువ డిమాండ్ కనిపించింది. నగరాలను బట్టి స్వీట్ల ఎంపికలోనూ తేడాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో చకోడీలకు మంచి ఆదరణ లభించింది. చెన్నైలో గులాబ్ జామూన్, అహ్మదాబాద్, జైపూర్‌లో సోన్‌పాపిడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
మరోవైపు ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నవారు హెల్తీ స్నాక్స్‌ను కూడా ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. ప్రోటీన్ చిప్స్ ఆర్డర్లు 239 శాతం, రాగి, జొన్న, సజ్జలతో తయారుచేసిన స్నాక్స్ ఆర్డర్లు 188 శాతం పెరిగాయి. మఖానా ఆర్డర్లలో 52 శాతం వృద్ధి నమోదైంది. మొత్తంగా ఈ ఏడాది దీపావళి షాపింగ్‌లో సంప్రదాయ కొనుగోళ్లతో పాటు ఆన్‌లైన్, క్విక్ కామర్స్ సేవలకు కూడా ప్రజలు పెద్దపీట వేస్తున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.