బంగారం కొనాలనుకునే వారికి షాక్.. ఒక్కరోజే తులంపై రూ.3,220 పెరుగుదల..!
హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,46,020కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,850గా నమోదైంది.
బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకు షాకిచ్చే వార్త. ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్న పసిడి ధరలు మరోసారి పెరిగాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం ఆభరణాలు కొనాలని ఎదురుచూస్తున్నవారు ధరల పెరుగుదలతో ఆలోచనలో పడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, రూపాయి మారకం విలువలో మార్పులు దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర గ్రాముకు రూ.322 పెరిగి రూ.14,602కు చేరింది. దీంతో 10 గ్రాముల తులం ధర రూ.1,46,020గా నమోదైంది. అంటే ఒక్కరోజులోనే తులం బంగారంపై రూ.3,220 పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.295 పెరిగి రూ.13,385కు చేరింది. ఈ లెక్కన 10 గ్రాముల ధర రూ.1,33,850గా ఉంది.
మరోవైపు వెండి ధరలు కూడా తగ్గే సూచనలు కనిపించడం లేదు. పారిశ్రామిక అవసరాలు, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ వంటి అంశాలు వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.2,10,000 వద్ద కొనసాగుతోంది. దీంతో వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి కూడా ధరలు భారంగా మారాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం విలువలో మార్పులు రానున్న రోజుల్లో దేశీయ ధరలను ప్రభావితం చేయనున్నాయి. అందువల్ల పసిడి, వెండి కొనుగోలు చేయాలనుకునేవారు మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.