వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

తెలంగాణ | రచన: Kalyan |

Hyderabad Fire: హైకోర్టు ఎదురుగా భారీ అగ్నిప్రమాదం.. బాంబే హోజరీలో దట్టమైన పొగలు..!

Hyderabad Fire
హైకోర్టు ఎదురుగా భారీ అగ్నిప్రమాదం.. బాంబే హోజరీలో దట్టమైన పొగలు..! Photo: హైకోర్టు ఎదురుగా భారీ అగ్నిప్రమాదం.. బాంబే హోజరీలో దట్టమైన పొగలు..!

హైదరాబాద్‌లోని మదీనా క్రాస్‌రోడ్ వద్ద బాంబే హోజరీ వస్త్ర దుకాణం, గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది, చార్మినార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ హైకోర్టుకు ఎదురుగా ఉన్న మదీనా క్రాస్‌రోడ్ వద్ద బాంబే హోజరీ వస్త్ర దుకాణం, గోదాములో సోమవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. భారీగా పొగలు వెలువడటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, చార్మినార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హోల్‌సేల్ వస్త్ర దుకాణం, గోదాము కావడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఎంతమేర నష్టం జరిగిందనే విషయం ఇంకా స్పష్టతకు రాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, నష్టం అంచనాపై మరింత సమాచారం రావాల్సి ఉంది.