Jailer 2: 8 రోజుల్లోనే రూ.600 కోట్లు.. 75 ఏళ్ల వయసులోనూ తగ్గని తలైవా క్రేజ్..!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.606.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ నివేదికలు వెల్లడించాయి.
75 ఏళ్ల వయసులోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. కొత్త తరం హీరోలు పోటీ పడుతున్నా.. తనదైన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు తలైవా. ఆయన నటించిన తాజా చిత్రం ‘జైలర్ 2’ వసూళ్లలో దూసుకుపోతోంది. విడుదలైన ఎనిమిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల మార్కును దాటడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 15న థియేటర్లలో విడుదలైంది. ట్రేడ్ ట్రాకర్ సాక్నిల్క్ గణాంకాల ప్రకారం, ఎనిమిదో రోజు ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్రాస్ వసూళ్లు రూ.606.05 కోట్లకు చేరాయి. ఇందులో భారతదేశం నుంచి రూ.391.55 కోట్ల గ్రాస్ రాగా, విదేశీ మార్కెట్ల నుంచి రూ.214.50 కోట్లు వచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇండియాలో నెట్ వసూళ్లు రూ.334.35 కోట్లుగా నమోదయ్యాయి.
సినిమాలో రజినీకాంత్ నటన, ఆయన మార్క్ స్టైల్, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం, నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రజినీకాంత్‌తో పాటు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, విద్యాబాలన్, యోగిబాబు తదితరులు నటించారు.
ఇక రూ.600 కోట్ల మార్కును దాటిన ‘జైలర్ 2’ తదుపరి ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందనే ఆసక్తి నెలకొంది. సినిమా వసూళ్లు ఇదే స్థాయిలో కొనసాగితే మరిన్ని మైలురాళ్లను చేరే అవకాశం ఉంది. అయితే రూ.800 కోట్లు లేదా రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందా అనేది రాబోయే రోజుల్లో వసూళ్లపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా, ఎనిమిది రోజుల్లోనే రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం రజినీకాంత్ స్టార్‌డమ్‌కు మరో నిదర్శనంగా నిలుస్తోంది.