వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

ఆంధ్రప్రదేశ్ | రచన: Pallavi |

విజయవాడ మేయర్ రేసులో వంగవీటి రాధా.. జనసేన అభ్యర్థుల తొలి జాబితాకు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. తొలి విడతలో 14 మంది అభ్యర్థులను ప్రకటించగా.. విజయవాడ, ఏలూరు కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలకు అభ్యర్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. తొలి విడతలో 14 మంది అభ్యర్థులను ప్రకటించగా.. విజయవాడ, ఏలూరు కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పెరుగుతోంది. ఇప్పటికే అధికార కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తికాగా, తాజాగా అభ్యర్థుల ప్రకటన ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆమోదంతో ఈ అభ్యర్థుల జాబితాను ప్రకటించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తొలి జాబితాలో మొత్తం 14 మంది అభ్యర్థులకు జనసేన అవకాశం కల్పించింది. వీరిలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన అభ్యర్థులు, 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. ఇటీవల జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణకు కూడా ఈ జాబితాలో చోటు దక్కడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. ఏలూరు కార్పొరేషన్‌ నుంచి శ్రీ రెడ్డి అప్పలనాయుడును బరిలోకి దింపింది. కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా జనసేనకు నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఛైర్మన్ స్థానాలు దక్కాయి. జనసేన పోటీ చేసే కార్పొరేషన్లలో శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ ఉన్నాయి. 21 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రాజాం, పాలకొండ, సాలూరు, తుని, పిఠాపురం, సామర్లకోట, అమలాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తెనాలి, చిలకలూరిపేట, దర్శి, పుట్టపర్తి, పుత్తూరు తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఇక మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు కొనసాగిస్తోంది. స్థానిక ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు. అభ్యర్థుల ప్రకటనతో ఏపీలో స్థానిక ఎన్నికల రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.