Crime News: ఖరీదైన మందు బాటిళ్లలో నీళ్లు, చీప్ లిక్కర్.. నిజాంపేటలో అసలు దందా బయటపడింది!
నిజాంపేటలో ఖరీదైన మద్యం బాటిళ్లలో నీరు, చీప్ లిక్కర్ కలిపి విక్రయిస్తున్న కల్తీ దందా వెలుగులోకి వచ్చింది. లిక్కర్ మార్ట్ యజమాని గంధం ప్రవీణ్ గౌడ్‌ను ఎక్సైజ్ డీటీఎఫ్ అధికారులు అరెస్ట్ చేసి, నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రీమియం, మీడియం బ్రాండ్ల మద్యం బాటిళ్లలో కల్తీ చేస్తున్నట్లు గుర్తించి లిక్కర్ మార్ట్‌ను సీజ్ చేశారు.
ఖరీదైన మద్యం కొనుగోలు చేస్తున్న వారికి షాక్ ఇచ్చే మోసం నిజాంపేటలో వెలుగులోకి వచ్చింది. ప్రీమియం, మీడియం బ్రాండ్ల మద్యం బాటిళ్లను లక్ష్యంగా చేసుకుని వాటిలో కల్తీకి పాల్పడుతున్న లిక్కర్ మార్ట్ యజమానిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. గంధం ప్రవీణ్ గౌడ్ అనే వ్యక్తి కొంతకాలంగా ఈ దందా సాగిస్తున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ డీటీఎఫ్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించి నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
మద్యం బాటిళ్లలో అసలు ఏం కలుపుతున్నారంటే.. ఖరీదైన బ్రాండ్ల బాటిళ్ల మూతలు తెరిచి, అందులోని కొంత మద్యాన్ని తొలగించి నీరు, చీప్ లిక్కర్ కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా అసలైన ప్రీమియం మద్యం పేరుతో నాసిరకం మద్యాన్ని వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఖరీదైన, మీడియం రేంజ్ బ్రాండ్లను ఎంచుకుని ఈ కల్తీ వ్యవహారం నడిపినట్లు ఎక్సైజ్ డీటీఎఫ్ అధికారులు తెలిపారు.
దాడుల్లో పట్టుబడిన ప్రవీణ్ గౌడ్‌ను అరెస్ట్ చేయడంతో పాటు అతడి వద్ద లభించిన కల్తీ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు సీజ్ చేసిన మద్యం బాటిళ్లను నిజాంపేట ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. కల్తీ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన లిక్కర్ మార్ట్‌ను కూడా అధికారులు సీజ్ చేశారు. ప్రీమియం మద్యం పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్న ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.