వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

జ్యోతిష్యం | రచన: Kalyan |

ఈ రాశుల వారికి గజకేసరి రాజయోగం.. డబ్బు, ఉద్యోగం, అదృష్టం కలిసి రాబోతున్నాయట..!

lucky-3-zodiac

నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు గురు, చంద్ర గ్రహాల కలయికతో గజకేసరి రాజయోగం ఏర్పడనుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఈ యోగంతో కర్కాటక, ధనుస్సు, సింహ రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార పురోగతి వంటి శుభ ఫలితాలు కలగవచ్చని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు.

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ఏర్పడే యోగాలు జీవితంలో సానుకూల మార్పులకు సంకేతమని జ్యోతిష్యులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే నవంబర్ చివరి రోజులు, డిసెంబర్ ప్రారంభంలో ఓ ప్రత్యేక గ్రహ కలయిక చోటుచేసుకోనుందని చెబుతున్నారు. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రావడంతో పాటు ఆర్థికంగా కూడా మంచి రోజులు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్న గురు గ్రహం, చంద్రుడితో కలవనున్నాడు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు ఈ రెండు గ్రహాల కలయిక కొనసాగనుంది. ఈ సమయంలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుందని, జ్యోతిష్య పరంగా ఇది శుభ ఫలితాలను ఇచ్చే యోగంగా భావిస్తారని చెబుతున్నారు. అన్ని రాశులపై కొంత ప్రభావం ఉన్నప్పటికీ, ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ గ్రహ కలయిక అనుకూలంగా ఉండనుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం, ఉద్యోగ ప్రయత్నాల్లో పురోగతి, వ్యాపారాల్లో లాభాలు వంటి ఫలితాలు వీరి జీవితాల్లో చోటుచేసుకోవచ్చని చెబుతున్నారు. కర్కాటక రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా కొంత ఊరట కలిగించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. చాలాకాలంగా చేతికి అందకుండా ఉన్న డబ్బు తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడవచ్చని, కొత్త ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉందని చెబుతున్నారు. కుటుంబంలో గతంలో ఉన్న చిన్నచిన్న విభేదాలు తొలగిపోయి ప్రశాంతత పెరిగే సూచనలు ఉన్నాయట. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు లభించవచ్చని, తమకు నచ్చిన రంగంలో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ధనుస్సు రాశి వారికి ఈ గ్రహాల కలయిక అదృష్టాన్ని పెంచే సమయంగా భావిస్తున్నారు. ఇంతకాలం వాయిదా పడుతూ వస్తున్న పనులు కొలిక్కి రావడంతో పాటు కొత్త ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు కనిపించవచ్చని అంటున్నారు. విదేశాలకు వెళ్లాలని ఆశపడుతున్న వారు, ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు అనుకూల సమాచారం అందే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు రావడం, లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయని.. ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు ఈ సమయం ఉపయోగపడవచ్చని జ్యోతిష్య అంచనాలు పేర్కొంటున్నాయి. ఇక సింహరాశి వారికి ఈ మూడు రోజులు మరింత కీలకంగా మారనున్నాయని చెబుతున్నారు. ఈ రాశిలోనే గురు, చంద్రుల కలయిక జరగనుండడంతో ఆత్మవిశ్వాసం పెరగడం, కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో స్పష్టత రావడం వంటి మార్పులు చోటుచేసుకోవచ్చని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు దక్కే అవకాశాలు ఉండడంతో పాటు పై అధికారుల నుంచి గుర్తింపు లభించవచ్చని చెబుతున్నారు. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదిరే ఛాన్స్ ఉందని, గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావడం మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు ఏర్పడనున్న ఈ గజకేసరి రాజయోగం మూడు రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా అనుకూల మార్పులు తీసుకొచ్చే సమయమని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఇవన్నీ జ్యోతిష్య అంచనాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాలు, గ్రహస్థితుల ఆధారంగా ఫలితాల్లో మార్పులు ఉంటాయని గుర్తుంచుకోవాలి.