వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

వార్తలు | రచన: Kalyan |

Pawan Kalyan: రూ.4.75 కోట్లతో వేసిన రోడ్డు.. ట్రాక్టర్‌తో దున్నేశారు.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్..!

Pawan Kalyan
రూ.4.75 కోట్లతో వేసిన రోడ్డు.. ట్రాక్టర్‌తో దున్నేశారు.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్..! Photo: రూ.4.75 కోట్లతో వేసిన రోడ్డు.. ట్రాక్టర్‌తో దున్నేశారు.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్..!

ప్రజల ప్రయాణ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రోడ్లు నిర్మిస్తుంటే.. కొందరు మాత్రం వాటిని ధ్వంసం చేసేందుకు వెనుకాడటం లేదు. ప్రజాధనంతో నిర్మించిన రోడ్డును ట్రాక్టర్‌తో తవ్వేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపింది.

ప్రజల ప్రయాణ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రోడ్లు నిర్మిస్తుంటే.. కొందరు మాత్రం వాటిని ధ్వంసం చేసేందుకు వెనుకాడటం లేదు. ప్రజాధనంతో నిర్మించిన రోడ్డును ట్రాక్టర్‌తో తవ్వేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఏపీ ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం గ్రామం నుంచి పాపక్కగారిపల్లెకు వెళ్లే బీటీ రోడ్డును కొందరు ట్రాక్టర్‌తో తవ్వేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజినీరింగ్ అధికారులు పవన్ కల్యాణ్‌కు వివరించారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన రహదారిని ఇలా ధ్వంసం చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన మౌలిక వసతులను వ్యక్తిగత కారణాలతో నాశనం చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా ఈ రహదారిని సుమారు రూ.4.75 కోట్ల వ్యయంతో నిర్మించారు. రోడ్డు నిర్మాణం పూర్తయి వారం రోజులు కూడా గడవకముందే సుబ్బారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి అనే వ్యక్తులు సుమారు 100 మీటర్ల మేర రహదారిని ట్రాక్టర్‌తో తవ్వేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రోడ్డుపై కంకర బయటకు కనిపించేలా దెబ్బతింది. ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు పవన్ కల్యాణ్‌కు వివరించారు. ఈ ఘటనపై స్పందించిన పవన్ కల్యాణ్.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అవసరమైన చట్టపరమైన నిబంధనల ప్రకారం కఠిన సెక్షన్లు నమోదు చేయాలని సూచించారు. అలాగే, ప్రభుత్వ ఆస్తి నష్టం నివారణ చట్టం కింద రోడ్డు పునరుద్ధరణకు అయ్యే ఖర్చును బాధ్యుల నుంచి వసూలు చేసే అవకాశాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఎవరైనా ఉండి ప్రోత్సహించినా, వారికి సహకరించినా విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల పన్నుల రూపంలో సమకూరిన నిధులతో నిర్మించిన రహదారులను కాపాడుకోవడం ప్రభుత్వంతో పాటు ప్రజల బాధ్యత కూడా. ఇలాంటి ఘటనలను ఉపేక్షిస్తే ప్రజలకు ఉపయోగపడాల్సిన మౌలిక వసతులు దెబ్బతినే ప్రమాదం ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేసి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసేలా వ్యవహరించాలని స్పష్టం చేశారు.