వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

వినోదం | రచన: Kalyan |

షూటింగ్ మొదలుకాకముందే రిలీజ్ డేట్ ఫిక్స్? రామ్ చరణ్-సుకుమార్ సినిమాపై క్రేజీ టాక్..!

ram-charan

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17 సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. 2027 మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు 2028 మే నెలలో సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే రిలీజ్ డేట్‌పై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మరో భారీ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న RC17పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రారంభోత్సవం కూడా జరగడంతో ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం RC17 ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. కథ, స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దడంతో పాటు నటీనటుల ఎంపిక, ఇతర కీలక సాంకేతిక విభాగాలకు సంబంధించిన పనులపై మూవీ టీమ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 మార్చి నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. షూటింగ్ ఇంకా మొదలుకాకముందే సినిమా విడుదల తేదీ విషయంలోనూ చిత్ర బృందం ఒక ప్రాథమిక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. 2028 మే నెలలో RC17ను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ వార్త బయటకు రావడంతో రామ్ చరణ్ అభిమానుల్లో సినిమా రిలీజ్‌పై చర్చ మొదలైంది. దర్శకుడు సుకుమార్ తనదైన కథనం, మేకింగ్ స్టైల్‌తో రామ్ చరణ్‌ను సరికొత్తగా చూపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సినిమా కోసం తగినంత సమయం కేటాయించి, ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని యూనిట్ భావిస్తోందట. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా RC17ను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది టీమ్ ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. అయితే 2028 మే నెలలోనే సినిమా విడుదలవుతుందన్న వార్తపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం వినిపిస్తున్నదంతా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే. మరి నిజంగానే సుకుమార్, రామ్ చరణ్ కాంబో మూవీకి 2028 మే నెలను టార్గెట్ చేశారా? షూటింగ్ ప్రారంభం, రిలీజ్ డేట్‌పై చిత్ర బృందం ఎప్పుడు స్పష్టత ఇస్తుందో చూడాలి.