వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

వినోదం | రచన: Kalyan |

Shalini Pandey: రెడ్ బికినీలో హాట్ ట్రీట్.. అబ్బా.. అర్జున్ రెడ్డి పాప అరాచకం..!

Shalini Pandey
Shalini Pandey Photo: Shalini Pandey

టాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు తమ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంటే.. మరికొందరు సోషల్ మీడియా ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఈ రెండో కోవలోకి వస్తోంది అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే. తాజాగా ఈ అమ్మడు రెడ్ బికినీలో చేసిన ఫొటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

టాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు తమ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంటే.. మరికొందరు సోషల్ మీడియా ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఈ రెండో కోవలోకి వస్తోంది అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే. తాజాగా ఈ అమ్మడు రెడ్ బికినీలో చేసిన ఫొటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన గ్లామరస్ లుక్‌తో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆమె లేటెస్ట్ లుక్‌పై ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. రెడ్ బికినీలో స్టైలిష్‌గా కనిపిస్తూ కెమెరాకు ఫోజులిచ్చిన షాలినీ పాండే ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంతో పోలిస్తే ఆమె ఫిజిక్‌లోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు ఆమె లేటెస్ట్ లుక్స్ చూస్తే అర్థమవుతోంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆమె కొత్త ఫొటోలు అభిమానుల మధ్య చర్చకు దారితీస్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమాతోనే షాలినీ పాండేకు భారీ గుర్తింపు వచ్చింది. ప్రీతి పాత్రలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత 'మహానటి'లో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. ఎన్టీఆర్ బయోపిక్‌లో షావుకారు జానకి పాత్ర పోషించింది. నందమూరి కల్యాణ్ రామ్‌తో '118', 'ఇద్దరి లోకం ఒకటే', 'నిశ్శబ్దం' వంటి సినిమాల్లోనూ నటించింది. అయితే అర్జున్ రెడ్డి స్థాయిలో మరో భారీ విజయం మాత్రం ఆమె ఖాతాలో పడలేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లోనూ షాలినీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తమిళంలో '100% కాదల్'లో నటించగా.. బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ సరసన 'జయేష్‌భాయ్ జోర్దార్'లో కనిపించింది. 'మహారాజ్' సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫొటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా రెడ్ బికినీ ఫొటోలు వైరల్ కావడంతో మరోసారి ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. మరి ఈ కొత్త లుక్‌తోనైనా షాలినీకి మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయా? మళ్లీ వెండితెరపై బిజీ అవుతుందా? అనేది చూడాలి.