వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

జ్యోతిష్యం | రచన: Kalyan |

Shani: శని దేవుడి అనుగ్రహం మొదలైంది.. ఈ 4 రాశుల వారికి ఇక ఆర్థిక కష్టాలు ఉండవంట..!

shani

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్నారు. 2027 మార్చి వరకు ఈ రాశిలో కొనసాగనున్న నేపథ్యంలో నాలుగు రాశుల వారికి అనుకూల ఫలితాలు కలగవచ్చని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు.

జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడి పేరు వినగానే చాలామందికి కష్టాలు, పరీక్షలు గుర్తుకొస్తాయి. కానీ శని ఎప్పుడూ ఇబ్బందులే కలిగించడని, మన కర్మలను బట్టి తగిన ఫలితాలను కూడా అందిస్తాడని పండితులు చెబుతుంటారు. క్రమశిక్షణ, పట్టుదల, కఠోర శ్రమకు ప్రతీకగా భావించే శనిదేవుడు ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్య అంచనాల ప్రకారం 2027 మార్చి వరకు ఇదే రాశిలో కొనసాగనున్నాడు. ఈ సమయంలో శని సంచారంతో కొన్ని రాశుల వారికి గతంలో ఎదురైన ఇబ్బందులు తొలగి, శ్రమకు తగిన ప్రతిఫలం దక్కే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం, వ్యాపారంలో కొత్త అవకాశాలు వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. మరి ఆ అదృష్టం అందుకోబోతున్న నాలుగు రాశులు ఏవో తెలుసుకుందాం. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మిథున రాశి వారికి ఈ సమయం ఊరటనిచ్చేలా ఉంటుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చేతికి రావాల్సిన డబ్బు ఆలస్యమవుతూ ఇబ్బంది పడుతున్న వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చని భావిస్తున్నారు. మొండిబాకీలు వసూలయ్యే అవకాశాలు ఉండటంతో ఆర్థికంగా కొంత స్థిరత్వం లభించవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశాలు తలుపుతట్టే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన అవకాశాలు కలిసి రావచ్చని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. కన్యా రాశి వారికి కూడా శని సంచారం అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలాకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నుంచి క్రమంగా బయటపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు రావడంతో పాటు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకోవచ్చు. కొత్త బాధ్యతలు కూడా చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారాన్ని మరింత విస్తరించాలని ఆలోచిస్తున్న వారికి ఇది అనుకూల సమయంగా మారవచ్చు. చాలాకాలంగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు కూడా ఈ సమయంలో మార్గం లభించే సూచనలు ఉన్నాయని జ్యోతిష్య అంచనాలు వెల్లడిస్తున్నాయి. మకర రాశి వారికి కూడా ఈ శని సంచారం కెరీర్ పరంగా కీలక మలుపు తీసుకురావచ్చని చెబుతున్నారు. ఇప్పటివరకు పడిన కష్టానికి, చేసిన శ్రమకు తగిన గుర్తింపు లభించే సమయం దగ్గరపడవచ్చని పండితులు అంటున్నారు. ఉద్యోగాల్లో ఉన్నవారికి మెరుగైన అవకాశాలు రావడంతో పాటు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. గతంలో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తూ కెరీర్‌లో ముందడుగు వేసేందుకు ఈ సమయం సహకరించవచ్చని అంచనా వేస్తున్నారు. వృషభ రాశి వారికి కూడా శని సంచారం కెరీర్ పరంగా కలిసిరావచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి విషయంలో సానుకూల పరిణామాలు చోటుచేసుకోవచ్చు. తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపార అవకాశాలు కూడా కలిసి రావచ్చు. మొత్తంగా ఇప్పటివరకు ఎదురైన ఇబ్బందులను అధిగమించి ఆర్థికంగా, వృత్తిపరంగా ఎదిగేందుకు అవకాశాలు లభించవచ్చని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి.