Astrology: సూర్యుడి రాశి మార్పుతో ఈ 4 రాశులకు అదృష్టం.. నెల రోజుల పాటు పట్టిందల్లా బంగారమే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడి రాశి మార్పు కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను తీసుకురావచ్చని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మిథునం, కన్య, మకరం, కుంభ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి కనిపించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిని ఆత్మవిశ్వాసం, గౌరవం, అధికారం, నాయకత్వ లక్షణాలు, సామాజిక ప్రతిష్టకు ప్రతీకగా భావిస్తారు. అందుకే సూర్యుడి రాశి మార్పు కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల పరిణామాలకు కారణమవుతుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన పురోగతి కనిపించే అవకాశాలున్నాయని అంటున్నారు. నవరంబర్ నెలలో ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
మిథున రాశి వారికి ఈ నెల రోజుల సమయం అనుకూలంగా ఉండనుంది. ఉద్యోగ రంగంలో చాలాకాలంగా పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. పైఅధికారుల నుంచి ప్రశంసలు, సహకారం అందవచ్చు. మీ అభిప్రాయాలకు కార్యాలయంలో ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడటంతో ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే బలపడే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
కన్యా రాశి వారికి కుటుంబపరంగా ఊరట లభించవచ్చు. కొంతకాలంగా కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు తగ్గవచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.
మకర రాశి వారికి సూర్యుడి సంచారం ఆర్థికంగా కలిసివచ్చే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు కనిపించవచ్చు. వ్యాపారులకు అనుకూలమైన పరిణామాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా కీలక బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ప్రయోజనాలు పొందవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక కుంభ రాశి వారికి కెరీర్ పరంగా సానుకూల మార్పులు చోటుచేసుకోవచ్చు. పనిలో ప్రతిభకు గుర్తింపు లభించడంతో పాటు ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు, ఉద్యోగ మార్పు కోరుకునేవారికి శుభవార్త అందే సూచనలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. అయితే ఇవన్నీ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పే అంచనాలు మాత్రమే.