నవంబర్ 6 వరకు ఈ 4 రాశులకు తిరుగులేని అదృష్టం.. కోరుకున్న కోరికలు నెరవేరే ఛాన్స్..!
అక్టోబర్ 24న సూర్యుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించాడు. నవంబర్ 6 వరకు ఇదే నక్షత్రంలో కొనసాగనున్నాడు. ఈ సమయంలో వృషభం, కుంభం, తులా, మిథున రాశులవారికి ఆర్థికంగా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గ్రహాలకు రాజుగా భావించే ఈ గ్రహం సంచారంలో వచ్చే మార్పులు అన్ని రాశులపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా సూర్యుడి నక్షత్ర మార్పు కొన్ని రాశులవారి జీవితాల్లో అనుకూల పరిస్థితులను తీసుకొస్తుందని విశ్వసిస్తారు. ఈ క్రమంలో అక్టోబర్ 24న సూర్యుడు రాహువుకు సంబంధించిన స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించాడు. నవంబర్ 6 వరకు ఇదే నక్షత్రంలో కొనసాగనున్నాడు. ఈ సమయంలో నాలుగు రాశులవారికి ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యాపారాల్లో పురోగతితో పాటు చాలాకాలంగా ఎదురుచూస్తున్న కోరికలు నెరవేరే సూచనలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
వృషభ రాశివారికి సూర్యుడి స్వాతి నక్షత్ర సంచారం అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం కలిసి రావచ్చు. వ్యాపార భాగస్వాముల నుంచి సహకారం లభించడంతో పాటు కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే సూచనలు ఉన్నాయి. వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నవారికి మంచి సమయం కావచ్చు. పెట్టుబడులు, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. చాలాకాలంగా వేధిస్తున్న డబ్బు సంబంధిత సమస్యలు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని పండితులు చెబుతున్నారు.
కుంభ రాశివారికి కూడా ఈ నక్షత్ర సంచారం శుభప్రదంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో సానుకూల మార్పులు కనిపించవచ్చు. కొత్త పనులు ప్రారంభించాలనుకునేవారికి అనుకూల అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మంచి సమయం కావచ్చు. గతంలో చేసిన కష్టానికి తగిన గుర్తింపు, ప్రతిఫలం పొందే అవకాశం ఉంటుంది. అదృష్టం కలిసిరావడంతో పాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు కనిపించవచ్చని జ్యోతిష్యులు అంటున్నారు.
తులా రాశివారికి సూర్యుడి నక్షత్ర సంచారం వల్ల అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా జీవితంలో చాలాకాలంగా ఎదురవుతున్న సమస్యల నుంచి క్రమంగా ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారికి పరిస్థితులు మెరుగుపడవచ్చు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరగడంతో పాటు దేవాలయాలను సందర్శించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలోనూ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడవచ్చు. గతంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులను అధిగమించి ముందుకు వెళ్లేందుకు ఈ సమయం పండితులు వివరిస్తున్నారు.
మిథున రాశివారికి ఈ సూర్య నక్షత్ర సంచారం మరింత అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఉద్యోగ, వృత్తిపరమైన వ్యవహారాల్లో పురోగతి కనిపించవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నవారి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలంగా కొనసాగుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. మొత్తంగా నవంబర్ 6 వరకు ఈ రాశివారు అనుకూల ఫలితాలను పొందే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.