వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

వినోదం | రచన: Pallavi |

హీరో తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వైరల్.. కాబోయే భార్య ఎవరో తెలుసా? పెళ్లి ఎప్పుడంటే?

హీరో తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వైరల్

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక నవంబర్ 16న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి, రవితేజ, నాని, రానా తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. నవంబర్ 16న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్‌లో తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తేజ సజ్జా నిశ్చితార్థ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు ఈ వేడుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, నాని, రానా దగ్గుబాటి, దర్శకుడు ప్రశాంత్ వర్మ, అల్లు అరవింద్, నిహారిక కొణిదెల తదితరులు హాజరయ్యారు. దీంతో ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక తేజ సజ్జా కాబోయే భార్య గురించి అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఆమె అమెరికాలో పెరిగిన యువతి అని, టెక్నాలజీ రంగానికి చెందిన కుటుంబ నేపథ్యం ఉందని గతంలో తేజ వెల్లడించారు. ఆమెకు సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని, తన తండ్రితో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. అయితే ఆమె వ్యక్తిగత వివరాలను మాత్రం తేజ గోప్యంగా ఉంచుతున్నారు. మరోవైపు వీరిద్దరి వివాహం డిసెంబర్ 2026లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక నిర్వహించనున్నట్లు సమాచారం. అనంతరం హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో అభిమానులు తమ అభిమాన హీరోకు విషెస్ చెబుతున్నారు.