వార్తలకు వెళ్లండి
MAHA NAGAR DAILY తెలుగు వార్తల సంచిక
మహానగర్ — Maha Nagar Daily NEWS · FACTS · PUBLIC INTEREST
English
వార్తల విభాగాలు

తెలంగాణ | రచన: Kalyan |

TS Inter Exams: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తేదీలివే..!

TS Inter Exams

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి 2027 ఇంటర్ పబ్లిక్ పరీక్షల తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 19 వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 20 వరకు జరగనున్నాయి. ప్రాక్టికల్స్, అంతర్గత మూల్యాంకనం తేదీలను సైతం ప్రకటించింది. పూర్తి పరీక్షల షెడ్యూల్ వివరాలు తెలుసుకోండి.

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షల సన్నాహాల్లో కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2027 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థుల థియరీ పరీక్షల తేదీలతో పాటు ప్రాక్టికల్స్, ఇతర పరీక్షల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఈ టైమ్‌టేబుల్ వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు సైతం వర్తించనుండగా, వాటికి సంబంధించిన ప్రత్యేక షెడ్యూల్‌ను విడిగా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షల తేదీలు ముందుగానే తెలియడంతో విద్యార్థులు తమ చదువుకు ప్రణాళిక సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. పరీక్షలకు ముందు నిర్వహించే అంతర్గత మూల్యాంకనం, ప్రాక్టికల్స్ తేదీలను కూడా బోర్డు వెల్లడించింది. ఫస్ట్ ఇయర్ ఇంటర్నల్ అసెస్‌మెంట్ జనవరి 20 నుంచి 25, 2027 వరకు జరగనుంది. జనవరి 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష, జనవరి 29న ఇదే సమయానికి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జనవరి 29న, సెకండ్ ఇయర్ విద్యార్థులకు జనవరి 30న జరగనున్నాయి. సెకండ్ ఇయర్ సైన్స్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ఆదివారాలతో సహా రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఫస్ట్ ఇయర్ సైన్స్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు మూడు సెషన్లలో నిర్వహించనున్నారు. ఒక్కో సెషన్ రెండు గంటల పాటు ఉండనుంది. ఫస్ట్ ఇయర్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 24, 2027న 2వ లాంగ్వేజ్ పేపర్-1తో ప్రారంభమై మార్చి 19న ముగియనున్నాయి. ఫిబ్రవరి 26న ఇంగ్లీష్ పేపర్-1, మార్చి 2న మ్యాథమెటిక్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1, ఏసీఈ గ్రూప్ అకౌంటెన్సీ పేపర్-1 పరీక్షలు ఉంటాయి. మార్చి 5న మ్యాథమెటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1, ఏసీఈ గ్రూప్ కామర్స్ పేపర్-1 నిర్వహిస్తారు. మార్చి 9న ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1, మార్చి 15న కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-1 పరీక్షలు జరగనున్నాయి. మార్చి 17న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, ఎంఈసీ గ్రూప్ మ్యాథమెటిక్స్ పేపర్-1 ఉంటాయి. చివరిగా మార్చి 19న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1, బైపీసీ విద్యార్థుల బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-1తో ఫస్ట్ ఇయర్ పరీక్షలు పూర్తవుతాయి. సెకండ్ ఇయర్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 25, 2027న 2వ లాంగ్వేజ్ పేపర్-2తో ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 27న ఇంగ్లీష్ పేపర్-2, మార్చి 3న మ్యాథమెటిక్స్ పేపర్-2A, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 8న మ్యాథమెటిక్స్ పేపర్-2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2 ఉంటాయి. మార్చి 12న ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2, మార్చి 16న కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. మార్చి 18న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2 నిర్వహిస్తారు. చివరి రోజైన మార్చి 20న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2, బైపీసీ విద్యార్థుల బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-2తో సెకండ్ ఇయర్ పరీక్షలు ముగుస్తాయి. థియరీ పరీక్షలన్నీ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఈ తాత్కాలిక షెడ్యూల్‌ను అనుసరించి సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.