Weather Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో జాగ్రత్త!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమతో పాటు తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో వర్ష సూచన ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వాతావరణం మారనుంది. రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడటంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఆదివారం నుంచి మంగళవారం వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని, వర్షం సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరోవైపు తెలంగాణలోనూ వర్ష సూచన జారీ అయింది. రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది.
ఈ జిల్లాల్లో వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రైతులు, ప్రయాణాలు చేసే వారు స్థానిక వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.