Factory Blast: యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం.. పేలుడు ధాటికి కార్మికుడి మృతి..!
యాదాద్రి భువనగిరి జిల్లాలోని దండుమల్కాపురం పారిశ్రామికవాడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ పరిశ్రమలో ఆక్సిజన్ సిలిండర్లు పేలడంతో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోగా, మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పారిశ్రామికవాడలో భారీ పేలుడు కలకలం సృష్టించింది. దండుమల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలోని ఓ పరిశ్రమలో ఆక్సిజన్ సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృత్యువాతపడగా, మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. కళ్లముందే సిలిండర్లు పేలడంతో పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
పేలుడు తీవ్రతకు పరిశ్రమలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదంలో గాయపడిన కార్మికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు తమతో కలిసి పనిచేసిన సహోద్యోగి ప్రాణాలు కోల్పోవడంతో తోటి కార్మికులు విషాదంలో మునిగిపోయారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఈ ఘటన తీరని శోకాన్ని మిగిల్చింది.
అయితే అసలు ఆక్సిజన్ సిలిండర్లు ఎందుకు పేలాయన్నది తెలియాల్సి ఉంది. సిలిండర్లలో సాంకేతిక లోపం తలెత్తిందా? మరేదైనా కారణంతో ఈ ప్రమాదం జరిగిందా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో ఎంతమంది కార్మికులు విధుల్లో ఉన్నారు? ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.